AP High Court: ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఇంటికి విద్యుత్, నీళ్లు బంద్ 10 d ago
ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయండి హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో వాహనదారులు నిబంధనలు పాటిస్తారు.. ఏపీలో మాత్రం పాటించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్ళగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని, హైదరాబాద్లో అద్దాలకు నల్ల ఫిలిమ్స్ ఉన్న కారు ఒక్కటి కనిపించదని... అక్కడ చట్టనిబంధలు కఠినంగా అమలు చేస్తారని హైకోర్ట్ వ్యాఖ్యానించింది.
అదే ఆంధ్రలో కార్ల అద్దాలకు నల్ల ఫిలిమ్స్ ఉంటున్నాయని..ఎవరూ సీటు బెల్టులు పెట్టుకోవడం లేదని ఆగ్రహించింది. పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మూడు నెలల్లో 667 మంది మృత్యువాత పడ్డారని.. నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని దాఖలైన పిటిషన్పై విచారణ సమయంలో ఈ విధంగా హైకోర్ట్ వ్యాఖ్యానించింది.